పశ్చిమగోదావరి జిల్లా తణుకులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 సెల్ఫోన్లు, ఒక ఎల్ఈటీ టీవీ, రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్తో తెలుగు రాష్ట్రాల్లోని మరో 20 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వేల్పూర్ రోడ్డులోని సీఆర్ఎస్ఎస్ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. పాలంగి గ్రామానికి చెందిన బొక్క శివకుమార్, తిరుపతికి చెందిన చంద్రశేఖరరెడ్డి తణుకు చెందిన మహాపాత్ర హరీష్, కిరణ్ కుమార్, పైడిపర్రు గ్రామానికి చెందిన గొర్రెల సాయిబాబు అనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'