ETV Bharat / state

'నరసాపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి'

author img

By

Published : Jun 8, 2020, 12:47 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాలను.. నరసాపురంలో ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు తీర్మానించాయి. ఈ మేరకు పార్టీలకతీతంగా వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.

cpi round table meeting in narasapuram west godavari district
అఖిలపక్ష సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక వైద్య కళాశాల నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోంది. ఇటీవల జిల్లాలో నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో స్థలాలను మంత్రి ఆళ్ళ నాని పరిశీలించారు.

ఈ నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నరసాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే తీరం వెంబడి ఉన్న తూర్పు, పశ్చిమ, కృష్ణా ప్రాంతాల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఖిలపక్షం తీర్మానించింది. దీనికోసం పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి...

రాష్ట్రానికి వచ్చింది 40 వేల మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.