పశ్చిమగోదావరిజిల్లాలో కరోనా పంజావిసురుతోంది. 24గంటల వ్యవధిలోనే జిల్లాలో 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 915కి చేరుకొంది. 24 గంటల్లో ఏలూరులో 70కేసులు నమోదవగా.. అత్తిలిలో 12, మొగల్తూరులో 4, నరసాపురంలో 4, భీమవరం, నిడదవోలు, పెదవేగిలో 3, పెనుగొండ, పెరావళి, మార్టేరు, పాలకొల్లు ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
మిగతా పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివిగా గుర్తించారు. జిల్లాలో ఇప్పటి వరకు 60,878 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 8,989మంది ఉన్నారు. 915పాజిటివ్ కేసుల్లో 166మంది డిశ్చార్జ్ కాగా 749మంది చికిత్స పొందుతున్నారు. గత వారంరోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతీరోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: తెదేపా సీనియర్ నేత నాయుడు రామచంద్రరావు కన్నుమూత