పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా దూకుడుకు కళ్లెం పడటం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తాజాగా 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పురుషులు 19 మంది ఉండగా... మహిళలు 18 మంది ఉన్నారు. ఈ కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 455కు చేరుకుంది. 37 కేసుల్లో ఏలూరులో అత్యధికంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నరసాపురంలో 6, పోడూరు మండలంలో, పినకడిమిలో, భీమవరంలో ముగ్గురికి చొప్పున, మోడీలో 4, భీమడోలు, పెంటపాడు మండలం అలంపురం, తణుకు, పాలకోడేరు మండలం వేండ్రలో ఒక్కొక్కరికి చొప్పున ఈ వ్యాధి సోకింది. ఏలూరుకు చెందిన వ్యక్తి, పెంటపాడుకు చెందిన మహిళ కరోనాతో మృతిచెందారు.
కరోనా దూకుడు... పెరుగుతున్న కేసులు - west godavari corona cases updates
పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 455కి చేరింది. తాజాగా ఏలూరుకు చెందిన వ్యక్తి, పెంటపాడుకు చెందిన మహిళ కరోనాతో మృతిచెందారు.