ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: వాయినాల కోసం మా ఇంటికి ఎవరూ రావద్దని ఫ్లెక్సీ - భీమవరంలో వాయినాల కోసం ఇంటికి రావద్దని ఫ్సెక్సీ

భీమవరంలో ఓ ఫ్లెక్సీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది మేము వ్రతాలు, నోములు చేయట్లేదు.. మా ఇంటికి ఎవరూ వాయినాలకు రావద్దూ..అంటూ ఆ ఫ్లెక్సీలో రాసుంది. కరనా వ్యాప్తితో అయినవారికి నోటితో చెప్పలేక ఇలా ఏర్పాటు చేశామని చెబుతున్నారు లక్ష్మి.

corona effect vaayanam banner in bheemavaram

author img

By

Published : Jul 20, 2020, 9:16 PM IST

Updated : Jul 20, 2020, 9:27 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వాయినాలు ఇవ్వడానికి మా ఇంటికి రావద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్​గా మారాయి. ఈ ప్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తోంది. భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ తమ ఇంటికి ఎవరు వాయినానికి రావద్దని, తాము ఈ సంవత్సరం వ్రతాలు, నోములు చేయడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

శ్రావణ మాసంలో చుట్టుపక్క వీధుల్లోని మహిళలు పసుపు కుంకుమ, వాయనం ఇచ్చేందుకు తమ ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తమ ఇంటికి ఎవ్వరినీ రావొద్దని నోటితో చెప్పలేక.. బాగా ఆలోచించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు

Last Updated : Jul 20, 2020, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.