ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని వల్ల పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది అంతా గృహ నిర్బంధంలో ఉండాలంటూ ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌పై కరోనా ప్రభావం పడింది. ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి రాగా.. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుడిని సమీపంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్, అతని కుటుంబసభ్యుల్ని 28 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు.
వారి ప్రభావం మిగిలిన సిబ్బందిపైనా పడింది. అక్కడ పని చేసే పోలీసులందరూ గృహ నిర్బంధంలో 28 రోజులు ఉండాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు క్వారంటైన్లో ఉన్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ .విశ్వనాథన్ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ స్టేషన్‌లోని 19 మందిని ఈనెల 28 వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని... స్వీయ గృహనిర్బంధంలో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: