పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సైతం పెరుగుతుండటంతో అటు అధికారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 275 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఆగస్టు నెలలోనే 102 మంది కరోనా బాధితులు మరణించారు. జిల్లాలో ఇప్పటివరకు 21,226 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజూ 6 వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో ఏలూరు జిల్లా ఆస్పత్రిని ఇప్పటికే కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో కొవిడ్ ఆస్పత్రిగా మార్పులు చేశారు. జిల్లాలో 7 ప్రాంతాల్లో కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: పోటెత్తిన వరద గోదావరి... గ్రామాలకు రాకపోకలు బంద్