పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని కరోనా కలవరం సృష్టిస్తోంది. తణుకు పట్టణంలో 2 వేల కేసులు, నియోజకవర్గంలోని 2 మండలాల్లో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు.
కరోనా ప్రారంభ దశలో తణుకు పట్టణం, నియోజకవర్గంలో 50 రోజుల వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. మే నెల 21వ తేదీన తణుకులో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా కేసులు పెరుగుతూ ఇప్పటికి 2 వేల కేసులకు చేరాయి.
మూడు మండలాల్లోనూ కలిపి 2 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ నిబంధనల సడలింపుతో పాటు ప్రజలు సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కనీస నిబంధనలు పాటించకపోవటంతో కేసులు పెరిగినట్లు వైద్యాధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవీ చదవండి..