పశ్చిమగోదావరి జిల్లాలో గోనె సంచులు లేక మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 30 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ప్రభుత్వం 85,101 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను మిల్లింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కొందరు రైతులు తక్కువ ధరకే విక్రయించేశారు. మరికొంతమంది రైతులు పంటను విక్రయించడానికి ఆంక్షలు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలు తొలగించి, రైతులకు సకాలంలో సంచులు అందించి కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు