ETV Bharat / state

కోడి పందేల స్థావరాలపై దాడి.. 32 మంది అరెస్టు - కోడిపందేలు న్యూస్

పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెం శివారులో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 32 మందిని అరెస్టు చేసి.. రూ.25 లక్షల విలువైన కోడి పుంజులు, రూ.4.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి
కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి
author img

By

Published : Nov 7, 2021, 1:02 PM IST

Updated : Nov 7, 2021, 3:35 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి శివారులో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కోడి పందేలు కాస్తున్న 32 మందిని అరెస్టు చేశారు. రూ.25 లక్షల విలువైన కోడి పుంజులు, రూ.4.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 26 కార్లు, 35 బైకులు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..యర్రంపల్లి శివారులోని ఓ పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందటంతో చింతలపూడి పోలీసులతో కలిసి దాడి చేశామన్నారు. దాడుల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 65 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనా స్థలంలో 33 మందిని అరెస్టు చేయగా..మరో 32 మంది వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పోలీసుల తీరుపై అనుమానాలు..

పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేసే సమయంలో కోడి పందాల నిర్వాహకులు అక్కడే ఉన్నారని అరెస్టు తర్వాత వారు స్టేషన్​లో కనిపించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దెందులూరుకి చెందిన ఓ వైకాపా నేతతో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖులు పందేల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధికి కీలక అనుచరుడిగా పలువురు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. తాళిబొట్టు కాజేసిన దొంగలు!

Last Updated : Nov 7, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.