ETV Bharat / state

పశ్చిమగోదావరిలో జోరుగా సాగిన కోడిపందెేలు - పశ్చిమగోదావరిలో జోరుగా కోడిపందెేలు

పశ్చిమగోదావరిజిల్లాలో సంక్రాంతి మూడురోజులు కోడిపందేలు జోరుగా సాగాయి. ఎన్ని ఆంక్షలు విధించినా.. వాటిని లెక్కచేయకుండా.. కత్తికట్టిన కోడి పందేనికి సై అంది. ఆధునిక హంగులతో వందల కోడిపందేల బరులు ఏర్పాటు చేసి.. పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. జిల్లాలో కోడిపందేల్లో ఒక వ్యక్తి మృతిచెందగా.. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకొన్నాయి.

పశ్చిమగోదావరిలో జోరుగా సాగిన కోడిపందెేలు
author img

By

Published : Jan 17, 2020, 7:54 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో సంక్రాంతి పండుగ మూడురోజులు సంబరంగా సాగింది. పల్లె నుంచి పట్టణం వరకు సంబరాలు అంబరాన్ని అంటాయి. బంధుమిత్రులతో లోగిళ్లు.. కళకళలాడాయి. కోడిపందేనికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజలు పండుగ చేసుకొన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కోడిపందేలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వందల బరులు ఏర్పాటు చేసి... కత్తి కట్టి కోడిపందేలు జరిపారు. కోడిపందేలా నిర్వహణ కోసం డెల్టా ప్రాంతంలో పెద్ద బరులు ఏర్పాటు చేయగా.. మెట్టప్రాంతంలో ఓ మోస్తారు బరులు ఏర్పాటు చేశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో కోట్లాది రూపాయలు పందేలు సాగాయి. పెద్ద బరిలో లక్ష నుంచి 20లక్షల రూపాయల వరకు పందేలు జరిగాయి. ఓ మోస్తారు బరుల్లో 30వేల నుంచి లక్ష రూపాయల వరకు పందేలు సాగాయి. జిల్లాలో సుమారు 7వందల వరకు చిన్న, పెద్ద బరులు ఏర్పాటు చేశారు.
మొత్తంగా రెండువందల కోట్ల రూపాయల వరకు పందేల లావాదేవీలు సాగినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చి లక్షల రూపాయల పందేలు కాశారు. భారీగా షామియానాలు, ఫ్లడ్ లైట్లు.. తిలకించేందుకు వేదికలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద భారీగా జూదాలు జరిగాయి. గుండాట, పేకాట వంటి జూదాల్లో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. మొదటి రోజు అధికార యంత్రాంగం కోడిపందేలు నియంత్రించేందుకు ప్రయత్నించిన వారి ప్రయత్నాలు ఫలించలేదు. వేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇవేమి లెక్కచేయకుండా పందెంరాయుళ్లు బరులు ఏర్పాటు చేశారు.
కోడిపందేల సందర్భంగా చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. పెదవేగి, చింతలపూడి, గోపాలపురం ప్రాంతాల్లో కోడిపందేల సయమంలో ఘర్షణలు చెలరేగి... దాడులు ప్రతిదాడులకు దారితీశాయి. మూడురోజులపాటు పోలీసులు ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా పలువురిపై కేసులు నమోదు నమోదు చేశారు. 280మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి

కోనసీమలో కన్నులపండువగా ప్రభల తీర్థాల ఊరేగింపు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.