వరదలపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ముత్యాలరాజు, మురళీధర్ రెడ్డితో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలిచ్చారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు...వరద తీవ్రత మరింతగా పెరిగే అవకాశమున్నందున లోతట్టు గ్రామాలను ఖాళీ చేయించాలని ఆదేశాలిచ్చారు. జిల్లా మంత్రులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావం.. జోరుగా ఒకటే వాన..