పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు.. నాలుగు కేసులలో ఏలూరు న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. నేడు కోర్టులో పూచీకత్తులు ఇచ్చిన తర్వాత చింతమనేని విడుదల కానున్నారు. మిగిలిన 14 కేసుల్లో ఇప్పటికే చింతమనేనికి బెయిల్ మంజూరైంది. రెండు నెలల కిందట చింతమనేనిపై పలు కేసులు నమోదు కావటంతో రిమాండ్ విధించారు. చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు కావటంతో దెందులూరు నియోజవర్గంలోని తెదేపా నాయకులు, కార్యాకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి
'విభజన నష్టం కంటే... జగన్ పాలనతోనే ఎక్కువ సమస్యలు'
. గ