చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసఫ్.. చింతమనేని తనను దుర్భాషలాడి, దౌర్జన్యం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే జిల్లా జైలులో రిమాండ్ ఉన్న చింతమనేనిని...పోలీసులు మళ్లీ అరెస్టు చేసి ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరుపరచగా... అక్టోబర్ 9 వరకు రిమాండ్ విధించింది. అనంతరం చింతమనేనిని జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 11న చింతమనేని ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులో తొలిసారిగా అరెస్టయ్యారు.
ఇదీ చదవండి :
చింతమనేనిపై మరో కేసు... 14 రోజుల రిమాండ్