ETV Bharat / state

ఏలూరులో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర - cbn in eluru praja chaitanya yatra

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రజాచైతన్య యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు యాత్రలో అమరావతికి మద్దతుగా పాల్గొన్నారు.

chandrababu prja chaitanya yatra in eluru
ఏలూరులో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
author img

By

Published : Jan 18, 2020, 2:05 PM IST

ఏలూరులో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చేరింది. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. తెదేపా నేత ఆలూరు నాగేశ్వరరావు రూ.50 వేలు రైతులకు మద్దతుగా అందజేశారు.

పోలీసుల తీరుపై చింతమనేని నిరసన
ఏలూరు నుంచి తాడేపల్లిగూడెంకు బయలుదేరుతున్న చంద్రబాబు కాన్వాయ్​ను పోలీసులు అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చింతమనేనికి సర్ది చెప్పటంతో ఆందళన విరమించారు.

ఇదీ చదవండి: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర

Intro:ap_tpg_81_18_excm_chandrababu_ap_ap10162

Body:మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద ఆగి జోలిపట్టి విరాళాలు సేకరించారు. అప్పనవీడు నుంచి దెందులూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆశ్రమ ఆస్పత్రి వరకు వచ్చారు . ఆశ్రం ఆసుపత్రి వద్ద మాజీ ఎంపీ మాగంటి బాబు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వాగతం పలికారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆలూరు నాగేశ్వర రావు చంద్రబాబు 50 వేలు విరాళం అందించారు. అదే విధంగా పలువురు చంద్రబాబుకు నగదు రూపంలో విరాళం అందించారు. అక్కడినుంచి తాడేపల్లిగూడెం వైపు బయలుదేరుతున్న చంద్రబాబు కాన్వాయ్ ముందు ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రహదారిపై బైఠాయించారు. నిమ్మల రామానాయుడు సర్దిచెప్పడంతో చింతమనేని రహదారిపై నుంచి లేశారు. కొన్ని వాహనాలను పోలీసులు వదిలేయడంతో అంతా అక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్నీ ఆంజనేయులు సీనియర్ నాయకులు ప్రసాద్ తదితరులు చంద్రబాబును కలిశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.