ETV Bharat / state

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ - పోలవరం ప్రాజెక్టు తాజా సమాచారం

పోలవరం ప్రోజెక్ట్​ పురోగతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ సందర్శించింది. జలవనరుల శాఖ అధికారులు వీరికి స్వాగతం పలికారు.

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ
పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ
author img

By

Published : Dec 29, 2019, 9:28 PM IST

పోలవరం సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల కమిటీ సందర్శించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ప్రాజెక్ట్ క్యాంప్ కార్యాలయం వద్ద కమిటీ సభ్యులకు జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. గోదావరి వరదల కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడటం వల్ల పనులు జాప్యం అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. నిపుణుల కమిటీ ఛైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా... ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించారు. రేపు విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి :

పోలవరం పనులను పరిశీలించిన ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ

Intro:AP_TPG_22_29_POLAVARAM_VISIT_NIPUNULA_COMMITE_AV_AP10088
యాంకర్: పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల కమిటీ సందర్శించింది . పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ప్రాజెక్ట్ క్యాంప్ కార్యాలయం వద్ద కమిటీ కు జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. కొద్ది మాసాలుగా గోదావరి వరదలు కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడిన అనంతరం తాజా పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తున్నారు . ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. పరిస్థితిని భేరీజు వేయడంతోపాటు ఇంతకుముందు తాము సూచించిన విధంగా పనులు కొనసాగుతున్నదీ లేనిదీ కమిటీ పర్యవేక్షించనుంది. నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించారు. రేపు విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.Body:పోలవరం విసిట్ నిపుణుల కమిటీConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.