ETV Bharat / state

సెల్​ఫోన్ దుకాణంలో చోరీ..నిందితుడి అరెస్టు - పశ్చిమగోదావరి జిల్లాలో సెల్​ఫోన్ దుకాణంలో చోరీ

నమ్మకంగా పని చేసినట్లు నటించి అన్నం పెట్టిన యాజమానికే సున్నం పెట్టాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో తాను పని చేస్తున్న మెుబైల్ దుకాణంలో రూ. 3 లక్షల 78 వేల విలువైన 21 సెల్​ఫోన్లను అహరించుకెళ్లాడు. యాజమాని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. 2 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సెల్​ఫోన్ దుకాణంలో చోరీ
సెల్​ఫోన్ దుకాణంలో చోరీ
author img

By

Published : Mar 15, 2021, 9:24 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఓ మెుబైల్ దుకాణంలో చోరీ జరిగింది. ఈ కేసును పట్టణ పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నూనె లీలా కుమార్ అనే వ్యక్తి పట్టణంలోని గమిని కాంప్లెక్స్​లో ఉదయ్ మెుబెల్స్ పేరిట రెండేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని దుకాణంలో రామసింగవరం గ్రామానికి చెందిన పొగిడి జీవ కుమార్ గతంలో నాలుగు నెలల పాటు పని చేసి మానేశాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత తిరిగి పనిలో చేరాడు.

గతంలో నమ్మకంగా పని చేయటంతో దుకాణం తెరవమని ఉదయం జీవ కుమార్​కు యాజమాని తాళాలు ఇచ్చి పంపించాడు. యాజమాని లీలా కుమార్ వచ్చేసరికి దుకాణం తెరిచి ఉండగా..జీవ కుమార్ కనిపించలేదు. అనుమానించి పరిశీలించగా..రూ. 3 లక్షల 78 వేల విలువైన 21 సెల్​ఫోన్లు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్​లో జీవ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకొని..న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఇదీచదవండి

అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.