పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ వ్యక్తి నూతనంగా చికెన్ సెంటర్ ప్రారంభించాడు. చలికాలం కావటంతో కొద్దిగా బిజినెస్ తగ్గింది. ఏం చేయాలో తెలియక... ఆలోచనకు పదునుపెట్టాడు. గొప్ప బంఫర్ ఆఫరిచ్చాడు. అది వింటే మీరు కూడా ఈయన ఆలోచన బంగారంగానూ అంటారు.
అదేంటంటే... ప్రస్తుతం ఉల్లిపాయలకు మంచి గిరాకీ ఉంది కదా... దీనినే ఎరగా వాడుకొని వ్యాపారాన్ని పెంచుకున్నాడు. కేజీ మాసం కొంటే అరకిలో ఉల్లిపాయలు ఉచితమని బ్యానర్ పెట్టాడు. దీనికి తోడు ఆఫర్ కూడా ఒక్కరోజు కావటంతో... ఊరంతా చికెన్ దుకాణం ముందు క్యూకట్టారు.
ఉచితంగా ఉల్లిపాయలు ఇస్తే కోడిమాంసం అమ్మకాలు పెరుగుతాయని ఆఫర్ ఇస్తున్నామని షాపు యజమాని చెప్పారు. ప్రస్తుతం 200 కిలోల కోడిమాంసం అమ్మామని ఆనందం వ్యక్తం చేశారు. గిరాకీ దృష్ట్యా ఈ ఆఫర్ను మరో మూడురోజులు కొనసాగిస్తున్నామని వివరించారు.
ఇవీ చదవండి