ద్వారకా తిరుమలలో భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్మిక సంక్షేమ పథకాలను రద్దు చేసినందుకు సంబంధిత జీవో పేపర్లను కార్మికులు దగ్ధం చేశారు. సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అనంతరం నగరంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన కార్మిక సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ దారి మళ్లిస్తున్నారంటూ నాయకులు వాపోయారు. అనంతరం వైఎస్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి :
'ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిధులను పక్కదారి పట్టిస్తుంది’