వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్‌ను వైకాపా ప్రత్యర్థిగా భావిస్తోందని ఆరోపించారు. వైకాపా తప్పుడు కేసులు బనాయించడం దారుణమని దుయ్యబట్టారు.
కేంద్ర నిధులతో నిర్మించిన భవనాలకు వైకాపా ప్రభుత్వ పేర్లు పెట్టడం విడ్డూరమని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విజయసాయిరెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. రాష్ట్రంలో విద్యా, వ్యవసాయం, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బడ్జెట్లో తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. వైకాపా 3వేల కోట్ల రూపాయలు దోచుకుందని సోము వీర్రాజు ఆరోపించారు.