ఆక్వారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని... మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు వివరించారు. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధి కోసం... కేంద్ర ప్రభుత్వం 20వేల కోట్ల రూపాయలు కేటాయించిందని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఆక్వాకి సాంకేతికంగా తోడ్పాటు అందించడం, ఉత్పత్తితో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి పెంచడమే లక్ష్యంగా కేంద్రం... ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు