పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బారీ కుంభకోణం వెలుగుచూసింది. నగరంలోని రెండు బ్యాంకుల్లో కొంతమంది వ్యక్తులు నకిలీ ఆస్తి పత్రాలతో దాదాపు 370 కోట్ల రూపాయలు రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లించకుండా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రుణాలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి..