చింతమనేని అరెస్టు వైకాపా నియంత పాలనకు నిదర్శనమని... తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఇది అక్రమ అరెస్టు అని.. తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో రాజారెడ్డి పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాతీర్పును జీర్ణించుకోలేక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని అక్రమ కేసును చింతమనేనిపై బనాయించారని ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల ప్రారంభం నుంచీ తెదేపా నాయకులు, సానుభూతిపరులపై హింసకు వైకాపా నేతలు పాల్పడుతూనే ఉన్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది పోలీసులు అతిజోక్యంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైకాపా పతనం ప్రారంభమైందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు