పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎమ్.నాగులపల్లిలో ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యవతిని హత్య చేసేందుకు పన్నాగం పన్నిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎం.నాగులపల్లికి చెందిన గాదంశెట్టి సత్యదేవ్.. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. చివరకు తన ప్రేమ అంగీకరించలేదని..పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెపై పగ పెంచుకున్నాడు.
ఎలాగైనా ఆమెను హతమార్చాలని.. కనీసం కాలు, చేయి విరిచి అవిటిదానిగా మార్చాలని దారుణమైన ఆలోచన చేశాడు. ఈ పని చేసేందుకు తన స్నేహితుడైన సరేష్ సహాయంతో ఏలూరుకు చెందిన ఆటోడ్రైవర్ కొత్తపల్లి సురేష్ తో.. 3 లక్షల రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నాడు.
విషయం తెలుసుకున్న బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఈ నెల 19న ఎం.నాగులపల్లిలో గాదం శెట్టి సత్యదేవ్ తన స్నేహితుడైన సురేష్ తో కలిసి కొత్తపల్లి సురేష్ కు అడ్వాన్సు రూ.40 వేలు ఇస్తుండగా.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:
అమానవీయం.. డబ్బు చెల్లించలేదని మైనర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు