పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో శనివారం రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. ప్రారంభ సమయంలో మాజీ మహిళా సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రిబ్బన్ కటింగ్ చేస్తుండగా స్థానిక వైకాపా నాయకుడు మహిళా సర్పంచ్‌ను పక్కకు నెట్టడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా సర్పంచ్ వర్గీయులు.. తాము ఎస్సీ అయినందువల్ల మరో వర్గం వారు తమను అవమానించారంటూ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి: రైతుకు తోడుగా రైతు భరోసా కేంద్రాలు:సీఎం జగన్