ETV Bharat / state

పశ్చిమ తీరం.. ఫ్యాను పరం - ycp

పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాను ప్రభంజనం సృష్టించింది. మెుత్తం 15 శాసన సభ స్థానాల్లో 13 కైవసం చేసుకుంది. తెదేపా 2 స్థానాలతో సరిపెట్టుంది. జనసేన అధినేత పవన్ పోటీచేసిన భీమవరంలో ఆయనకు చేదు అనుభవమే మిగలగా... కాంగ్రెస్, భాజపాలు ఖాతానే తెరవలేదు.

పశ్చిమలో ఫ్యాన్ ప్రభంజనం...
author img

By

Published : May 24, 2019, 6:09 AM IST

ఆంధ్ర రాజకీయాల్లో పశ్చిమ గోదావరిది ప్రత్యేక పాత్ర. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ గెలుపెంతో కీలకం. అటువంటిది తెదేపా పశ్చిమాన ఘోర పరాభవాన్ని చవిచూసింది. మంత్రి పితాని సత్యనారాయణ పాత్రినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో ఆయనకు ఓటమి తప్పలేదు. వైకాపాకు చెందిన తన సమీప పత్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వివాదాలతో నిత్యం వార్తాల్లో నిలిచే దెందులూలు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ఓటమి చవిచూశారు. వైకాపాకు చెందిన కొటారు అబ్బయ్య చౌదరి చేతిలో పరాభవం చెందారు. ఎస్సీ రిజర్వ్​డు నియోజకవర్గాలైన గోపాలపురం, చింతలపూడి,కొవ్వూరులో వైకాపా అధ్బుత విజయాలను సొంతం చేసుకొంది. గోపాలపురంలో వైకాపా అభ్యర్థి తలారి వెంకట్రావు తెదేపా అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావుపై విజయం సాధించారు. చింతలపూడిలో వైకాపా అభ్యర్థి వీఆర్ ఎలిజ తెదేపాకు చెందిన తన సమీప ప్రత్యర్థి కర్రా రాజారావుపై విజయ దుందుభి మోగించారు. కొవ్వూరులో తెదేపా అభ్యర్థి వంగలపూడి అనితపై వైసీపీ అభ్యర్థి వనిత తానేటి విజయం సాధించారు. ఎస్టీ రిజర్వ్​డ్​ నియోజకవర్గమైన పోలవరంలో వైకాపా నేత తెల్లం బాలరాజు తెదేపా నేత బొరగం శ్రీనివాసరాజుపై భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు.
హోరాహోరిగా సాగిన నరసాపురం ఎన్నికల లెక్కింపులో వైకాపా అభ్యర్థి ముదినూరి ప్రసాద్ రాజు, జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మధ్య విజయం దోబుచులాడింది. చివరకు ప్రసాద్ రాజు జయకేతనం ఎగరవేశారు. తణుకులో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఓటమి పాలయ్యారు. వైకాపాకు చెందిన వెంకట నాగేశ్వరరావు విజయ దుందుభి మోగించారు. తాడేపల్లిగూడెంలో తెదేపా అభ్యర్థి ఈలి నానిపై వైకాపా అభ్యర్థి కొట్టు సత్యనారయణ విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన ఏలూరు పోరులో తెదేపా అభ్యర్థి బడేటి కోట రామారావుపై వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని జయకేతనం ఎగరవేశారు. ఉంగటూరులో తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయలుపై వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు విజయం సాధించారు.

2 స్థానాలకే సైకిల్ పరిమితం
పాలకొల్లులో వైకాపా అభ్యర్థి డాక్టర్ బాబ్జీ పై తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు జయకేతనం ఎగరవేశారు. వైకాపాకు చెందిన తన సమీప ప్రత్యర్థి రామరాజుపై ఘన విజయం సాధించారు.

జనసేనానికీ తప్పని ఓటమి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్​కు చేదు అనుభవమే ఎదురైంది. రాష్ట్రంలో రెండు చోట్ల పోటీచేయగా ఆయన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. భీమవరం నియోజకవర్గంలో వైపాకు చెందిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓటమి పాలయ్యారు.

ఇదీచదవండి

తీర్పు 2019: భాజపా విజయానికి పది కారణాలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.