ETV Bharat / state

'రాష్ట్ర వ్యాప్తంగా 33 మినీ గోదాముల నిర్మాణం' - రాష్ట్ర వ్యాప్తంగా 33 మినీ గోదాముల నిర్మాణం

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సేవలను మరింత విస్తృత పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా మినీ విత్తన శుద్ధి కర్మాగారాలతో కూడిన గోదాములను నిర్మించనున్నట్లు సంస్థ మేనేజింగ్ ఇంజనీర్ అబ్దుల్ రహీమ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు సైతం సంస్థ సేవలు పొందేందుకు ఈ గోదాములు తోడ్పడతాయని ఆయన చెప్పారు.

'రాష్ట్ర వ్యాప్తంగా 33 మినీ గోదాముల నిర్మాణం'

author img

By

Published : Jun 10, 2021, 4:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని విత్తన శుద్ధి కర్మాగారాన్ని విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ ఇంజనీర్ అబ్దుల్ రహీమ్​ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సౌజన్యంతో 19కోట్ల 80లక్షల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 33 గోదాముల నిర్మించనున్నట్లు తెలిపారు. గోదాముల్లో మినీ విత్తన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో కుమారదేవం, రావిపాడు, ఎడవల్లి గ్రామాల్లో 3 మినీ గోదాములు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ కర్మాగారాల ద్వారా మొక్కజొన్న అపరాలు, కూరగాయల విత్తనాలు వంటి వాటిని అభివృద్ధి పరిచనున్నట్లు తెలిపారు. రైతులు ఎక్కడికక్కడే సకాలంలో విత్తనాలు అందించడానికి ఈ గోదాముల ద్వారా వీలు పడుతుందని అబ్దుల్ రహీం అభిప్రాయపడ్డారు. ఆయన వెంట ఏపీ సీడ్స్ పశ్చిమ గోదావరి జిల్లా మేనేజర్ నాగసాయిబాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

దిల్లీ చేరుకున్న సీఎం జగన్​.. కాసేపట్లో కేంద్రమంత్రులతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.