ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దుల్లో అదే సీను..ప్రయాణికుల ఇబ్బందులు

తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వచ్చే ప్రయాణికులకు సరిహద్దుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఇచ్చిన లాక్​డౌన్​ సడలింపును ఆంధ్రా పోలీసులు అమలు చేయడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతిస్తున్నారు.

ఇబ్బందులు
ఇబ్బందులు
author img

By

Published : Jun 1, 2020, 5:26 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో సీను మారలేదు. కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్​డౌన్​లో అంతరాష్ట్ర ప్రయాణాలపై విధించిన సడలింపును ఆంధ్రా పోలీసులు అమలు చేయడం లేదు. సరిహద్దు వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు ఉంటేనే రాష్ట్రంలోకి రాణిస్తున్నారు. ఎటువంటి పాసులు, అనుమతులు లేకపోయినా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని పాటించడం లేదు.

రాష్ట్ర ఉన్నతాధికారులు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ పోలీసులు వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఎస్​ఐ విశ్వనాథ బాబును వివరణ కోరగా రాష్ట్ర సరిహద్దు నుంచి వాహనాలను అనుమతించాలని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. అనుమతి రాగానే వాహనాలను విడిచి పెడతామన్నారు.

ఇదీ చూడండి: విజయవాడ నుంచి 14 రైళ్ల రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.