ఏపీ నిట్ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. శాశ్వత ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బిశ్వభూశణ్ హరిచందన్ పాల్గోనున్నారు. 1500 మంది కూర్చునేందుకు అనువుగా వేదికను నిర్మించారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ నవదీప్ సింగ్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. వెయ్యి మంది పోలీసుల నడుమ ప్రత్యేక కాన్యాయ్‌తో ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లను సభావేదిక వద్దకు తీసుకెళ్తామని నిట్ డైరక్టర్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. 379 మంది విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేస్తామని అన్నారు. జిల్లాలోని మంత్రులను, శాసనసభ్యులను ఆహ్వానించామని పేర్కొన్నారు.
నిట్ ప్రస్థానం ఇది...
ప్రతిష్ఠాత్మక ఏపీ నిట్‌ను తాడేపల్లి గూడేనికి 2015లో మంజూరు చేశారు. మొత్తం ఎనిమిది కోర్సుల్లో 480 సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇందులో 243 సీట్లను రాష్ట్ర విద్యార్థులు, మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా పీహెచ్డీ కోర్సులు ప్రవేశ పెట్టగా 50 మంది ప్రవేశాలు పొందారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చూడండి: