ETV Bharat / state

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు - పశ్చిమ గోదావరి ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు మంజూరు

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 425 ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించటానికి నిధులు మంజూరు చేసింది.

ap government releasing Fun for construction of health sub centers in West Godavari
పశ్చిమగోదావరిలో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు
author img

By

Published : Feb 20, 2020, 12:29 PM IST

పశ్చిమగోదావరిలో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. గ్రామాల్లో 638 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. వీటిలో 158 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ వివిధ రకాల పంచాయతీ, ప్రభుత్వ, ప్రైవేటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం జిల్లాలోని 425 ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలని నిర్ణయించింది.

ఒక్కొక్క భవన నిర్మాణానికి 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం రూ. 97.75 కోట్ల మంజూరు చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ భవనాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలను కూడా భారతీయ ఆరోగ్య మండలి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 26 కోట్ల 72 లక్షల రూపాయలను మంజూరు చేసింది.

మరో పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించడానికి నిర్ణయించారు. మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేయడానికి వీలుగా ప్రభుత్వం నిధులు కేటాయించింది.

ఇదీ చదవండి:

వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.