ANDHRA SUGARS: ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులైన పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ కృషి వల్లనే.. సంస్థ అభివృద్ధి సాధ్యమైందని ప్రస్తుత ఛైర్మన్ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి అన్నారు. వ్యవస్థాపకులతోపాటు బోళ్లబుల్లిరామయ్య అందించిన సేవలు సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. యాజమాన్యంతోపాటు సంస్థలో పనిచేసిన కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములని పేర్కొన్నారు.
ఆంధ్రా షుగర్స్ స్థాపించి 75 వసంతాలు పూర్తి అయిన వేళ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపారు. సంస్థలో 40 ఏళ్లకు పైగా పనిచేసిన విశ్రాంత కార్మికులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. నూతన వస్త్రాలతో సత్కరించింది. ఆజాదీకా అమృత మహోత్సవ్, ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తపాల శాఖ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల చిత్రాలతో కూడిన తపాలా బిళ్లను విడుదల చేశారు.
ఇవీ చదవండి: