రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి ఉద్యోగుల జేఏసీ తృతీయ వార్షికోత్సవాన్ని వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమరావతి జేఏసీ తృతీయ వార్షికోత్సవ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి ఏర్పడి మూడేళ్లయిందని.. వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ అమలు ఇతర సమస్యలపై ఈ సభలో చర్చిస్తామని అన్నారు.
ఇదీ చూడండి: