ETV Bharat / state

కొవిడ్ ఆసుపత్రుల హెల్ప్​డెస్క్​ల పనితీరుపై ఆళ్ల నాని ఆరా

కొవిడ్ ఆసుపత్రుల హెల్ప్​డెస్క్​ల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ హాస్పిటల్స్​లో హెల్ప్​డెస్క్​ల్లో సమాచారం అందడంలేదని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం, డీఎంహెచ్​వో, డీసీహెచ్​ఎస్, సూపరింటెండెంట్స్​తో మంత్రి మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఆళ్ల నాని
ఆళ్ల నాని
author img

By

Published : Jun 6, 2021, 3:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి హెల్ప్​డెస్క్​లు మరింతగా పటిష్టంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలని... మంత్రి ఆళ్ల నాని జిల్లా యంత్రాంగానికి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్​ను అదేశించారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ హాస్పిటల్స్​లో 24గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించాలని అధికారులను అదేశించారు.

జిల్లా వ్యాప్తంగా కొవిడ్ హాస్పిటల్స్​లో ప్రతి హెల్ప్​డెస్క్​లో ఒక మేనేజర్, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారని సూపరింటెండెంట్ మోహన్ మంత్రికి తెలిపారు. కొవిడ్ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తగ్గినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆక్సిజన్ పైపు లైన్స్, ఆక్సిజన్ నిల్వలు సంబందించిన పనులు నిలిపి వేయవద్దని, వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి అదేశాలు ఇచ్చారు.

ఏసమయంలోనైనా కొవిడ్ విస్తరించినా సరే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయాలపై కార్యాచరణ ఉండాలని, వివిధ హాస్పిటల్స్​లో ఏర్పాటు చేస్తున్న పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ నుంచి ఈ బెడ్స్​కు ఆక్సిజన్ అందడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రత్యామ్నాయంగా వాడుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించం, ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్యం అందించడం, ఇంజక్షన్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం తీవ్రతను బట్టి ఇంజక్షన్స్, మందులు ఎక్కడ ఉన్నా తెప్పించుకోవాలన్నారు.

కరోనా కష్ట కాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఫ్రంట్​లైన్ వారియర్స్​కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఆళ్ల నాని. వారి ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని డాక్టర్ భాస్కర్​రావు వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడవద్దని ఒక కోటి 50లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేసి అండగా నిలిచారాని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... anandayya medicine: సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.