మత్తు ప్రదార్థాల వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, నాటుసారా, మితిమీరిన మద్యం, గంజాయి వినియోగం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబ్కారీ శాఖ అధికారులు సూచించారు. వాటిని సేవించడం ద్వారా జీవితాలు చిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు. మత్తుపదార్థాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి