పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పాతబస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్..ఈ ఘటనలో మరో కోణం లేదన్నారు.
కాగా..ఇది ఓ వ్యక్తి చేసిన పనికాదని చాలా మంది హస్తం ఉందని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపి ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలన్నారు. డీఎస్పీ రవికిరణ్ స్పందిస్తూ..ప్రాథమిక విచారణలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎవరైనా ఉన్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచదవండి