గుడివాడ నుంచి కలకత్తాకు కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ... తణుకు వద్ద ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న వేగనిరోధకాలను ఢీకొట్టి దగ్ధమైంది. కోడిగుడ్ల పెట్టెలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు క్యాబిన్‌కు వ్యాపించకముందే డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. పెనుప్రమాదం తప్పింది. డీజీల్ ట్యాంకు పగలడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇది చూడండి: ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్