పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జెఎన్వీఆర్ ఉన్నత పాఠశాలలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పదో తరగతి డూప్లికేట్ మార్కుల మెమో జారీకి పూర్వ విద్యార్థి నుంచి ప్రధానోపాధ్యాయుడు జైశ్రీనివాస్ రూ 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి సూర్య ప్రకాష్ పదో తరగతి మార్కుల జాబితా పోవడంతో.. డూప్లికేట్ జాబితా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మార్కులు మెమో జారీ చేసేందుకు ప్రధానోపాధ్యాయుడు రూ 10,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా తమ బృందంతో దాడి చేసి పట్టుకున్నామని ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. నగదుతోపాటు పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని ప్రధానోపాధ్యాయులు కే. శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి. 'హలో నేను పోలీస్‌ను మాట్లాడుతున్నా.. మీ జుట్టు కత్తిరించుకోండి'