పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్హౌస్పేటకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకింది. వారిలో తల్లితండ్రులు, కుమార్తెను ఆశ్రం కోవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. 24 ఏళ్ల కుమారుడికి కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో హోంక్వారంటైన్లో ఉంచారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉండటంతో అతడు కుంగుబాటుకు గురై, బుధవారం ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చూడండి. కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు