పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రంలో కోనల మౌనిక(21) అనే యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ఐస్ ఫ్యాక్టరీ పక్కన ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఆమె ఒంటిపై కత్తిపోట్లు.. మృతదేహం పక్కన రక్తపు మరకలతో చాకు గుర్తించారు.
కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న మౌనిక ఆది అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. బయటికి వెళ్దామని చెప్పి.. ఆమెను తీసుకెళ్లాడు. రక్తపు చేతులతో పరిగెత్తుతుండగా చూసినట్లు నాగరాజు అనే యువకుడు చెప్పాడు. దీంతో ఆదినే మౌనికను చంపి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు.
ఇదీ చదవండి: అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడు మృతి