ETV Bharat / state

'నా ఇంటిని వైకాపా నేతలు లాక్కున్నారు.. న్యాయం చేయండి' - వైకాపా నేతల తీరుకు నిరసనగా ఓ మహిళ ఆందోళన

తన ఇంటిని వైకాపా నేతలు దౌర్జన్యంగా లాక్కుని... బయటకు గెంటేశారని ఏలూరులోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆందోళన చేపట్టారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ...కలెక్టర్​కు వినతిపత్రం అందించారు.

A woman protest at Eluru Collectorate
ఏలూరు కలెక్టరేట్ వద్ద మహిళ ఆందోళన
author img

By

Published : Nov 24, 2020, 11:52 AM IST

Updated : Nov 24, 2020, 3:58 PM IST

వైకాపా నాయకులు తన ఇంటిని లాక్కున్నారని ఆరోపిస్తూ... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎలిజిబెత్ రాణి అనే మహిళ ఆందోళన చేశారు. తన ఇంటిని దౌర్జన్యంగా వైకాపా నాయకులు లాక్కొని.. తనను వీధి పాలు చేశారని కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. అక్కడే ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.

తాను నిర్మించుకున్న ఇంటిని ఏలూరుకు చెందిన వైకాపా నాయకులు స్వాధీనం చేసుకొన్నారని.. తనను కట్టుబట్టలతో బయటకు గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఏలూరు నగరానికి చెందిన ఈ వృద్ధురాలు... తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్ భయం: బోసిపోతున్న ఘాట్లు.. కళ తప్పిన పుష్కరాలు

Last Updated : Nov 24, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.