పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం కాలువ వంతెన సమీపంలో బొలెరో కారు బోల్తా పడింది. పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలు కాగా.. స్థానికంగా చికిత్స అందించారు. స్థానికులు సహకారంతో కారును బయటికి తీశారు. ప్రమాదానికి గురైన కారు పోలవరం నుంచి జీలుగుమిల్లి వెళ్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: