పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, ఉండి మండలాలలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారి కుటుంబసభ్యులను వైద్య పరీక్షల కోసం ఏలూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం 33మందిని భీమవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ రోజు సాయంత్రానికి వీరి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి