పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెంరాయుళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోయాయి. తేతలి, దువ్వ, వేల్పూరు, అత్తిలి, ఇరగవరం తదితర ప్రాంతాల్లో కోడి పందేలతో పాటు...గుండాట, పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రెండోరోజూ.. పందెం రాయుళ్లు..బరుల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.
కోడి పందేలతో పాటు...గుండాట, పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రెండోరోజూ.. పందెం రాయుళ్లు..బరుల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఇదీ చదవండి:
వేలల్లో బరుల ఏర్పాటు.. రూ. కోట్లలో జూదం