ETV Bharat / state

'అభివృద్ది చూసి ఓర్వలేక తెదేపా నేతల తప్పుడు ప్రకటనలు'

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే తెదేపా నేతలు ఓర్వలేక పోతున్నారని... వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా పాదయాత్ర చేపట్టారు.

padayatra at  Vizianagaram
అభివృద్ది చూసి ఓర్వలేక తెదేపా నేతల తప్పుడు ప్రకటనలు
author img

By

Published : Nov 7, 2020, 7:06 PM IST

మాటతప్పని, మడమ తిప్పని నైజం గల జనహృదయనేత ముఖ్యమంత్రి జగన్ అని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ నాయకులు రంగారావు కొనియాడారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా వైకాపా.. విజయనగరం నియోజకవర్గ విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని బాలాజీ జంక్షన్ వద్ద నుంచి బాణసంచాలు, డప్పుల వాయిద్యాలు, జయహో జగన్ అన్న నినాదాలతో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇవ్వని హామీలనూ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కోలగట్ల శ్రావణి అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒకరికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే తెదేపా నేతలు ఓర్వలేక ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శ్రావణి పేర్కొన్నారు. వారి ప్రకటనలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, విజయనగరం పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, తదితర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్‌ ప్రభుత్వం మనుషుల్లా చూడటం లేదు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.