ETV Bharat / state

పార్టీలో వర్గ విభేదాలు.. రాజకీయ కక్షతో ఓ వర్గం ఏం చేసిందంటే..! - vizainagaram latest news

విజయనగరం జిల్లా కొండపర్తిలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అయితే ఓ వర్గానికి చెందిన నాయకుడు గ్రామం సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాజకీయ కక్షతో గ్రామానికి కంచె
రాజకీయ కక్షతో గ్రామానికి కంచె
author img

By

Published : Sep 6, 2021, 7:28 PM IST

రాజకీయ కక్షతో విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండపర్తి గ్రామంలోకి ప్రవేశం లేకుండా కంచె వేశారు. అధికార, వైకాపా నాయకుల మధ్య విభేదాలే కంచె వేయడానికి కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు.. ఊరి ముఖద్వారం వద్ద రోడ్డుకు అడ్డుగా కంచె వేశారు. లోతుగెడ్డ పంచాయతీ ఎన్నికల్లో కొండపర్తి గ్రామానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకులు పోటీ చేశారు. గ్రామంలో వలంటీర్లు, వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. అప్పటినుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల కిందట ఓడిపోయిన వర్గం వారు సర్పంచ్ వర్గీయులు పొలాలకు వెళ్లకుండా మార్గమధ్యంలో చెట్టును కూల్చివేశారు.

సర్పంచ్ వర్గీయులు చెట్టును తొలగించారు. దీనిని జీర్ణించుకోలేని ఓడిపోయిన వర్గం వారు ఆదివారం గ్రామ ముఖద్వారంలో కంచెను వేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా.. గ్రామానికి చెందిన శ్రావణి, లక్ష్మీ అనే మహిళలకు పురిటినొప్పులు వచ్చాయి. 108 వాహనం గ్రామానికి చేరుకున్నా కంచె తొలగించకపోవడంతో వాహనం శివారులో నిలిచిపోయింది..108 గ్రామంలోకి రాకపోవడంతో, గర్బణీలు నడుచుకుంటూ వెళ్లి వాహనం ఎక్కారు. రాజకీయ గొడవలతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదుటున్నారు గ్రామస్థులు. రాజకీయలతో గ్రామం ముందు కంచెను ఏర్పాటు చేయడం సరికాదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలకు మమ్మల్ని బలి చేయొద్దని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్లు విలువైన బంగారం మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.