ETV Bharat / state

అట్టహాసంగా ఇళ్లకు శంకుస్థాపన - పూర్తి చేయకుండానే మధ్యలో నిలిపివేత

YCP Government not Completed House Constructions: రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఇల్లు కట్టిసామని దాదాపు 25 లక్షల ఇళ్లకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి పూర్తి చేయకుండా ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. పేదల సొంతింటి కలను జగన్ పీడకలగా మార్చేస్తున్నారు. జగన్‌ సొంత జిల్లాలోనే దాదాపుగా 3 నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు పడలేదు. గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులను సైతం వైసీపీ సర్కార్‌ దారి మళ్లిస్తూ లబ్దిదారుల సొంతింటి కలను చెదరగొడుతోంది.

ycp_government_has_not_complete_in_housing_construction

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 2:59 PM IST

YCP Government Has Not Complete in Housing Construction: ప్రజలు ఇల్లు కట్టమంటే ప్రభుత్వం ఊళ్లు కడతామని దాదాపు 25 లక్షల ఇళ్లకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. కానీ రెండున్నరేళ్లు దాటినా ఇంకా మొండి గోడలు, వెక్కిరిస్తున్న పునాదులు, వేలాడుతున్న ఇనుపచువ్వలే కనిపిస్తున్నాయి తప్ప వాటిని పూర్తి చేసింది లేదు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇంటి నిర్మాణాలు కానిచ్చేస్తున్న జగన్‌ వాటిని కూడా దారిమళ్లించి పేదల సొంతింటి కలను పీడకలగా మార్చేస్తున్నారు. గుత్తేదారులు, లబ్దిదారులకు బిల్లులు చెల్లించకుండా చేతులెత్తేశారు. పండగొచ్చిన ప్రతీసారీ సామూహిక గృహప్రవేశాలంటూ హడావుడి చేయడం తప్ప ఇళ్ల నిర్మాణాలైతే కొలిక్కిరావడం లేదు. విన్నారుగా ఇళ‌్లు కాదు ఊళ్లే కడతాం అన్నారు. ఇవే జగనన్నచెప్పిన ఊళ్లు. ఇది సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని జగన్న కాలనీ. 2021 డిసెంబర్ 24న జగన్‌ ఇక్కడ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు 323 ఎకరాల్లో 7400 ఇళ్లు కడతామని జగన్‌ స్వయంగా ప్రకటించారు. అందులో చాలా ఇళ్లు రెండేళ్లు దాటినా ఇంకా పునాదుల దశ కూడా దాటలేదు.

Jagan Not Fulfil The Poor People Dream: ఇది విజయనగరం జిల్లా గుంకలాంలోని జగనన్న కాలనీ. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద లేఔట్‌ అని అప్పట్లో ఊదరగొట్టారు. ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనులపై లేదు అందుకే జగనన్న కాలనీ ఇంతవరకూ ఓ రూపానికీ రాలేదు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం 19 లక్షల 13 వేల గృహాలు ప్రారంభించింది. రెండున్నరేళ్లలో 8 లక్షలు గృహాలు ఇంకా పునాది, అంతకంటే తక్కువస్థాయి దాటలేదు. మరో 3.8 లక్షలు నివాసాలు బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. అన్నీ కలిపితే 11.8 లక్షల గృహాల పనులే మొదలయ్యాయి.

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..

Jagananna Houses Was Not Complete: ఇక ఆప్షన్-3 కింద ప్రభుత్వమే నిర్మించి ఇస్తామన్న గృహాల నిర్మాణం 19 లక్షల 13వేల గృహాల్లో, 3లక్షల 34 వేల ఇళ్లను ఆప్షన్‌-3 కింద లబ్ధిదారులు ఎంచుకున్నారు. ఇందులో పూర్తైంది కేవలం 50 వేల గృహాలే. రెండున్నర లక్షల గృహాలు బేస్‌మెంట్, అంతకంటే తక్కువస్థాయిలోనే పనులు నిలిచిపోయి ఉన్నాయి. ప్రభుత్వం బిల్లుల సరిగా చెల్లించకపోవడంతో గుత్తేదారులు కార్మికులకు సకాలంలో కూలీ చెల్లించలేకపోతున్నారు. ఫలితంగా చాలా చోట్ల కార్మికులు పనులు ఆపేసి వెళ్లిపోతున్నారు.

జగనన్న కాలనీల భూముల కోసం భారీ కుంభకోణం జరిగింది: నాదెండ్ల మనోహర్‌

Government Has Give up Not Able Complete Houses: ఎన్నికల ప్రణాళికలో జగన్‌ కట్టిస్తానన్న ఇళ్లు 25 లక్షలు. కానీ ఇప్పుడు పూర్తైన ఇళ్లు లెక్కిస్తే లబ్దిదారులు ఆయనకు అత్తెసరు మార్కులు కూడా వేసే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా కేవలం 6లక్షల15 వేల ఇళ్లే పూర్తిచేశారు. ఇందులోనూ బయట వైసీపీ రంగులేసుకుని, లోపల వదిలేసినవి బోలెడన్ని ఉన్నాయి. ఏదైనా పండగొస్తే సామూహిక గృహ ప్రవేశాలకు రెడీగా ఉండాలని లబ్ధిదారుల్ని ఊరించడం, దసరా, ఉగాది, సంక్రాంతి అని గడువుల మీద గడువులు పొడగించడం అలవాటైపోయింది. మరో 3 నెలల్లో ఎన్నికలున్నాయి. ఆ పెండింగ్​లోో ఉన్న ఇళ్లు పూర్తి చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇళ్లు కట్టుకున్న పేదలకు బిల్లులు చెల్లించకుండా ఏకంగా 300 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు.

Jagananna Houses Not Complete In Vizianagaram District: ఇంకో 800 కోట్ల రూపాయలు కేంద్ర నిధుల్ని ఇతర పథకాలకు మళ్లిం చేశారు. కేంద్ర వాటాకు తగినట్లు రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయడం లేదు. జగన్‌ సొంత జిల్లాలోనే దాదాపుగా 3 నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు పడలేదు. ఆ డబ్బుని అక్కడ ఆప్షన్‌-3 కింద కట్టే గుత్తేదారులకు ఇచ్చారు. విజయనగరం జిల్లాలో 25 కోట్ల రూపాయల మేర బకాయిలను ప్రభుత్వం పెండింగ్​లో పెట్టింది. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ 2నెలలుగా 10 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో చివరి స్టేజి బిల్లులకు నాలుగైదు నెలలుగా చెల్లింపులు లేవు. అవి ఇది వరకే పూర్తయ్యాయని కేంద్రానికి నివేదించి వచ్చిన డబ్బుల్ని ఇతర వాటికి వాడేసుకున్నట్లున్నారు. ఇప్పుడు చెల్లింపులకు ఆపసోపాలు పడుతున్నారు.

ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు - నరకయాతన అనుభవిస్తున్న లబ్ధిదారులు

YCP Government Is Diverting The Housing Funds: గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధుల్ని వైసీపీ సర్కార్‌ దారి మళ్లిస్తూ లబ్దిదారుల సొంతింటి కలను చెదరగొడుతోంది. ఇటీవల కేంద్రం 11వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఆ మొత్తాన్ని 27 రోజుల్లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు బదిలీ చేయాలి. కానీ గడువు దాటినా జమ చేయలేదని తెలిసింది. దాదాపుగా 800 కోట్ల రూపాయల మేర గృహ నిర్మాణ నిధుల్ని మళ్లించింది. కేంద్ర నిధులకు అనుగుణంగా రాష్ట్ర వాటాగా విడుదల చేయాల్సిన 200 కోట్ల రూపాయలను విడుదల చేయడంలేదు. కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలున్న చోట లబ్ధిదారులకు స్థలాలిచ్చిన వైసీపీ సర్కార్‌ వాటి చదును కోసం కోట్లు ఖర్చు పెట్టింది. అందులో చాలా మంది గుత్తేదారులకు ఇంకా బిల్లులు చెల్లించలేదు. సొంతగా ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు రీయంబర్స్‌ చేసేందుకే నిధుల్లేవేని చదును చేసిన వాటికి ఇంకెక్కడి నుంచి తీసుకురావాలని జిల్లా గృహనిర్మాణ శాఖ బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు. గుత్తేదారులేమో ఎవర్ని అడగాలో తెలియడం లేదని గగ్గోలు పెడుతున్నారు.

పనులు పూర్తి కాకుండానే జగనన్న ఇళ్లు ప్రారంభోత్సవం - ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ

పేదల సొంతింటి కల, పీడకలగా మార్చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.