ETV Bharat / state

మద్యం సీసాలో పురుగు.. వినియోగదారుడు అవాక్కు - liquor bottles in saluru

సాలూరు పట్టణంలోని దుకాణంలో మద్యం సీసాను కొనుక్కున్నాడో పారిశుద్ధ్య కార్మికుడు. తాగుదామని మూత తీయడానికి ప్రయత్నించాడు. అందులో పురుగు కనిపించిన కారణంగా.. ఒక్కసారిగా అవాక్కయ్యాడు. విక్రయదారులను సంప్రదించినా ఉపయోగం లేకపోవడంతో.. సామాజిక మాధ్యమాల్లో తన గోడు వెళ్లబోసుకున్నాడు.

worm in liquor bottle
మద్యం సీసాలో పురుగు
author img

By

Published : Oct 28, 2020, 8:28 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. వినియోగదారుడు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న దుకాణం నుంచి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మద్యం కొనుగోలు చేశాడు. పక్కనున్న గట్టుపై కూర్చుని సీసా మూత తీయడానికి ప్రయత్నించాడు. అందులో కనిపించిన పురుగును చూసి అవాక్కయ్యాడు.

సీసాలో పురుగు ఉందని.. మరొకటి ఇవ్వాలంటూ దుకాణాన్ని సంప్రదించానని కార్మికుడు తెలిపాడు. దానిని తాము తయారు చేయలేదని.. డబ్బు తిరిగి ఇచ్చేది లేదని విక్రయదారుడు సమాధానమిచ్చాడని తెలిపాడు. చేసేదేమీ లేక మద్యం సీసాను వారికే తిరిగి ఇచ్చేశానన్నాడు. ఈ ఘటనపై జిల్లా డిపో మేనేజర్ సుధీర్​ని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆ సీసాను సదరు కంపెనీకి పంపిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

స్నానానికి దిగిన వ్యక్తి గల్లంతు... 2 రోజుల అనంతరం 'వెలికితీత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.