విజయనగరం జిల్లా సాలూరు మండలం జిల్లేడువలస పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి చెందిన.. హనుమంత అమ్మాజీ అనే మహిళకు మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులు అధికమవ్వటంతో.. భర్త తమ్మయ్య, ఓ ఆశా వర్కర్‌తో సహా మరో నలుగురు బంధువులు కాలినడకన ఆస్పత్రికి బయల్దేరారు. కొండ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే.. నొప్పులు ఎక్కువ కావటంతో అక్కడే ప్రసవించింది. అనంతరం 104 ఫీడర్ అంబులెన్స్ లోనే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తల్లీ బిడ్డలను తరలించారు.
ఇదీ చదవండి: