ETV Bharat / state

జిల్లాలో పెరిగిన మహిళల అదృశ్యం కేసులు

కరోనా, లాక్‌డౌన్‌ కాలంలోనూ అదృశ్య కేసులు నమోదవుతున్నాయి. చాలామంది వివిధ కారణాలతో, వారింట్లో పరిస్థితుల నేపథ్యంలో బయటికి వెళ్లిపోతున్నారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉంటున్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ అదృశ్య ఘటనలపై కేసులు నమోదవ్వడం గమనార్హం.

జిల్లాలో పెరిగిన మహిళల అదృశ్యం కేసులు
జిల్లాలో పెరిగిన మహిళల అదృశ్యం కేసులు
author img

By

Published : Oct 8, 2020, 11:53 AM IST

* తల్లిదండ్రులు తన మాటకు గౌరవం ఇవ్వడం లేదన్న కోపంతో పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక నెల రోజుల కిందట ఇంట్లో నుంచి విశాఖపట్నం వెళ్లిపోయింది. ఆమె గురించి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించడం, పోలీసులను ఆశ్రయించే సరికి తాను ఫలానా దగ్గరున్నానని చెప్పి తిరిగి వెనక్కి వచ్చేసింది.
* విజయనగరంలో చదువుకోవడానికి వచ్చిన 15 ఏళ్ల బాలిక ఒక అబ్బాయితో ప్రేమలో పడి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.
* భర్తకు, భార్యకు మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలు పెరగడంతో మనస్పర్ధలు తీవ్రమయ్యాయి. దీంతో సుమారు 30 ఏళ్ల వయసు గల మహిళ తన 10 ఏళ్ల కుమార్తెను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.చరవాణి స్విచ్ఛాఫ్‌ చేసింది. పోలీసులు రంగంలోకి దిగి తల్లి, కుమార్తెను పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. దంపతులకుకౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ ఘటన రెండు వారాల కిందట ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
* సుమారు 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఉద్యోగం నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆమె కోసం తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారం అయ్యాక ఇంటికి వచ్చేసింది. ఇంట్లో పరిస్థితి నచ్చక వెళ్లిపోయినట్లు ఆమె పేర్కొన్నారు.
పోలీసులు గుర్తించినవి కొన్ని
15-22 ఏళ్ల లోపు
అమ్మాయిలు అదృశ్యమైన కేసుల్లో కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉండగా, మరికొంతమంది అందుకు భిన్నంగా చెబుతున్నారు. ఇంట్లో అన్నింటికీ అనుమానిస్తున్నారని, ఏ తప్పులు చేయకపోయినా నిందలు వేస్తున్నారని, అలాంటివి తట్టుకోలేక బయటకు వచ్చేసినట్లు చెబుతున్నారు.
23-35 ఏళ్ల లోపు
మహిళల విషయానికి వస్తే.. కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరిగిపోయిందని, తమ అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని, విలువ ఇచ్చే చోటు దొరుకుతుందనే ఉద్దేశంతో బయటకు వచ్చేస్తున్నామంటున్నారు. తీరా కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా మోసపోతున్నామని ఇంకొందరు చెప్పడం గమనార్హం.
36-50 ఏళ్ల లోపు
వారిని చూస్తే.. అనారోగ్యం, ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది.
50 ఏళ్లు దాటిన వారు
అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడంతో బయటకు వచ్చి తప్పిపోతున్నారని పోలీసుల దర్యాప్తుల్లో తేలింది.
కారణాలు అనేకం: మహిళలు, బాలికలు ఇళ్లల్లో నుంచి వెళ్లిపోవడానికి అనేక కారణాలున్నాయి. అదృశ్య సంఘటనలపై కేసులు నమోదవుతున్నప్పుడు స్టేషన్లకు సమాచారం అందిస్తున్నాం. వెంటనే అప్రమత్తమై అన్ని వైపులా బృందాలను పంపుతున్నారు. అందుకే చాలా వరకు కేసులను ఛేదించగలుగుతున్నాం. - బి.రాజకుమారి, ఎస్పీ

ఇదీ చదవండి

విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.