కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు నిలిచిపోయాయి. జీవనం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో యాచకులు, పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవా హృదయాలు వారిని ఆదుకుంటున్నారు.కానీ మూగ జీవాలను ఆదుకునేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరానికి చెందిన పి.సత్యవతి అనే మహిళ సమీప ప్రాంతాలైన గంటస్తంభం, కోట, తోటపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో.. శునకాలకు రోజుకు 2 పూటలా ఆహారం పెడుతున్నారు. వాటికి అండగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: